: రైతులను చైతన్య పరిచేందుకు స్వచ్ఛంద సంస్థలు కూడా కృషి చేయాలి: హైకోర్టు


రైతులను చైతన్య పరిచేందుకు స్వచ్ఛంద సంస్థలు కూడా కృషి చేయాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో, ప్రతిరోజూ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని, ప్రైవేటు అప్పులే రైతులకు భారం అయ్యాయని పిటిషనర్లు తెలిపారు. అయితే ప్రైవేటు రుణాలు తీసుకున్న రైతులను తీసుకురావాలని, గత 2 నెలల్లో ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలను వారంలోగా ప్రభుత్వ తరపు న్యాయవాదికి సమర్పించాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో ఆత్మహత్యల నివారణకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం వ్యాజ్యాలపై తదుపరి విచారణను కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News