: జిమ్ లో చిరంజీవి... చేతికి కట్టుతోనే కసరత్తులు!


తన తదుపరి చిత్రం కోసం శరీరాకృతిని మార్చుకుంటున్న చిరంజీవి, ఓ జిమ్ లో సందడి చేశారు. చిరంజీవికి పర్సనల్ జిమ్ ట్రైనర్ గా ఉన్న ప్రవీణ్ రెడ్డి, హైదరాబాద్ శివార్లలోని మణికొండ ప్రాంతంలో 'రాగాస్ ప్లెక్స్' పేరిట వ్యాయామశాలను ఏర్పాటు చేయగా దాన్ని చిరంజీవి ప్రారంభించారు. ఆపై అక్కడి వ్యాయమ పరికరాలను పరిశీలిస్తూ, కాసేపు కసరత్తులు చేశారు. ఇటీవల ముంబైలో కుడి చేతికి శస్త్రచికిత్స చేయించుకుని వచ్చిన తరువాత, చిరంజీవి ఎక్కడ కనిపించినా, హ్యాండ్ రెస్ట్ పౌచ్ తోనే కనిపిస్తున్న సంగతి తెలిసిందే. జిమ్ ప్రారంభోత్సవంలోనూ ఆయన అలాగే కనిపించారు.

  • Loading...

More Telugu News