: మరోసారి హైకోర్టుకెక్కిన 'ఓటుకు నోటు' మత్తయ్య!


హైకోర్టు నుంచి తాను స్టే ఆర్డర్ తీసుకున్నప్పటికీ, అధికారులు నోటీసులు ఇస్తున్నారని, ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఓ పిటిషన్ దాఖలు చేస్తూ, కేసు వివరాలను తెలియనీయకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తనకు న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేదని, ఈ విషయంలో హైకోర్టు కల్పించుకుని తన తరఫున వాదనలు వినిపించేందుకు ఒక లాయర్ ను నియమించాలని ఆయన కోరారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్న మత్తయ్య అరెస్ట్ ను తప్పించుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News