: విజయవాడ పండ్లమార్కెట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు... కృత్రిమ పద్ధతుల్లో పండ్లు మాగబెడుతున్నట్టు గుర్తింపు
విజయవాడ కేదారీశ్వరిపేట పండ్ల మార్కెట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు తనిఖీలు నిర్వహించారు. కార్బైడ్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో అధికారులు 15 బృందాలుగా వెళ్లి ఈ తనిఖీలు చేపట్టారు. పండ్లు పక్వానికి వచ్చేందుకు కొందరు వ్యాపారులు కృత్రిమ పద్ధతుల్లో మాగ బెడుతున్నారని అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. దాంతో పలు షాపులను అధికారులు సీజ్ చేశారు. మార్కెట్లో వ్యాపారులు ఎవరూ లైసెన్సులు కూడా తీసుకోలేదని, వీరిపై చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారిణి మంజరి చెప్పారు. కొంతమంది కార్బైడ్ వినియోగిస్తున్నట్టు గుర్తించామన్నారు. కృత్రిమ పద్ధతుల్లో పండ్లు మాగబెట్టాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.