: శంషాబాద్ 'నోవాటెల్' హోటల్ లో పేకాటరాయుళ్ల అరెస్టు
శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో ఈ తెల్లవారుజామున ఎస్ వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. ముందస్తు సమాచారం ప్రకారం అక్కడ పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.95వేల నగదు, 10 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్లను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హోటల్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు.