: అమెరికా సుప్రీంకోర్టు జడ్జీగా శ్రీ శ్రీనివాసన్?... తొలి ఎన్నారైగా రికార్డు సృష్టించనున్న వైనం
అగ్రరాజ్యం అమెరికా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రవాస భారతీయ న్యాయ నిపుణుడు శ్రీకాంత్ శ్రీ శ్రీనివాసన్ పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. అమెరికా టాప్ కోర్టు జడ్జి జస్టిస్ ఆంటోనిన్ స్కాలియా హఠాన్మరణంతో ఖాళీ అయిన పోస్టును భర్తీ చేసేందుకు రూపొందిన జాబితాలో శ్రీనివాసన్ పేరు మొదటి స్థానంలో ఉంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా శ్రీ శ్రీనివాసన్ ఎంపికకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఛండీగఢ్ కు చెందిన 48 ఏళ్ల శ్రీ శ్రీనివాసన్... ప్రస్తుతం కొలంబియా సర్క్యూట్ లోని యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ లో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. స్కాలియా మృతితో భర్తీ అయిన పోస్టును భర్తీ చేసేందుకు రూపొందనున్న ఏ జాబితా అయినా, శ్రీ శ్రీనివాసన్ పేరుతోనే మొదలు కావాల్సిన పరిస్థితులు ఉన్నాయని ‘సీఎన్ఎన్’ వార్తా సంస్థ పేర్కొంది.