: సినిమాలు తీయమని మాఫియా వాళ్లు డబ్బులెందుకు ఇస్తారు?: వర్మ
మాఫియా వాళ్లు గన్ చూపించి డబ్బులు వసూలు చేస్తారు తప్పా, డబ్బులిచ్చి సినిమాలు తీయమనరని దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. డబ్బులిచ్చి సినిమాలు తీయించాల్సిన అవసరం వాళ్లకు ఉంటే.. వాళ్లు మాఫియా ఎందుకు అవుతారు? అని ఆయన ప్రశ్నించారు. ‘మామూలు వాళ్లు అయితే డబ్బులిచ్చి సినిమాలు తీయమంటారు. మాఫియా వాళ్లు అయితే గన్ చూపించి చెప్పిన పని చేయమంటారు. అది చూసి ఎవరైనా భయపడతారు కనుక, చెప్పింది చేస్తారు’ అని వర్మ విశ్లేషించారు. విదేశాల నుంచి మాఫియా వ్యవహారాలన్నీ జరుగుతుంటాయని, నల్లధనాన్ని మార్చుకునేందుకు వాళ్లు సినిమాలు తీస్తారనేది ఒట్టి భ్రమ అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.