: నన్నెవ్వరూ పిలవాల్సిన ... తరమాల్సిన అవసరం లేదు: దర్శకుడు వర్మ
తన ఇష్టం వచ్చిన చోటుకు తాను వెళతానని.. తననెవ్వరూ పిలవాల్సిన.. తరమాల్సిన అవసరం లేదని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ‘ముంబయి నుంచి తరిమేస్తే హైదరాబాద్ కి వచ్చానన్నారు. ఇప్పుడేమో మళ్లా ముంబయికి వెళ్లిపోతున్నానని చెబుతున్నారు. ఇక్కడి నుంచి మిమ్మల్ని మళ్లీ ఎవరు తరిమేశారు?’ అన్న ప్రశ్నకు వర్మ పైవిధంగా స్పందించారు. ప్రతి వాడికి నోరు ఉంటుందని.. వాళ్ల ఇష్టమొచ్చినట్లు వాళ్లు మాట్లాడతారని అన్నారు. తాను ఏ విషయాన్నీ దాచుకోనన్న సంగతి అందరికీ తెలుసని వర్మ అన్నారు.