: అంబులెన్స్ బోల్తా... ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
విశాఖపట్టణం జిల్లా యలమంచిలి జాతీయరహదారిలో అంబులెన్స్ బోల్తా పడిన సంఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరి కొంతమంది గాయపడ్డారు. అంబులెన్స్ లో మృతదేహాన్ని తరలిస్తుండగా అది వంతెనపై నుంచి బోల్తా కొట్టింది. మృతదేహాం వెంట ఉన్న ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా వున్నారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను యలమంచిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖపట్టణం కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు.