: అహ్మదాబాద్ లో షారూక్ కారుపై రాళ్లదాడి!


బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కారుపై రాళ్లదాడి జరగడం కలకలం రేపింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నడిబొడ్డున నేటి తెల్లవారుఝామున ఈ ఘటన జరిగింది. తన తాజా చిత్రం 'రాయిస్' షూటింగ్ అహ్మదాబాద్ లో జరుగుతుండగా, షారూక్ అక్కడే మకాం వేశారు. రాళ్లదాడికి పాల్పడింది గుర్తు తెలియని దుండగులని, వారెందుకు ఈ చర్యకు పాల్పడ్డారో తెలియడం లేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం అందలేదు. దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్టు గుజరాత్ పోలీసు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News