: 50 ఓవర్లూ ఆడలేకపోయిన మన కుర్రాళ్లు... విండీస్ ముందు స్వల్ప లక్ష్యం!


అండర్-19 వరల్డ్ కప్ లో భాగంగా ఢాకాలో వెస్టిండీస్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో భారత కుర్రాళ్ల జట్టు 45.1 ఓవర్లలోనే 145 పరుగులకు ఆలౌటైంది. నిర్ణీత 50 ఓవర్లు కూడా క్రీజులో కుదురుకోలేకపోయిన జట్టులో సర్ఫరాజ్ ఖాన్ ఒక్కడే 51 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. 89 బంతులు ఎదుర్కొన్న ఖాన్ 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఈ పరుగులు సాధించాడు. మిగతా ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. పంత్ 1, కిషన్ 4, అన్ మోల్ ప్రీత్ 3, సుందర్ 7, అర్మాన్ జాఫర్ 5, లంరోర్ 19, డాగర్ 8, అవేష్ ఖాన్ 1, ఆర్ఆర్ బాతం 21, కేకే అహ్మద్ 2 పరుగులు చేశారు. 23 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో లభించాయి. విండీస్ బౌలర్లలో జోసఫ్, జాన్ లకు చెరో మూడు వికెట్లు లభించాయి. మరికాసేపట్లో 146 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో వెస్టిండీస్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.

  • Loading...

More Telugu News