: అమీర్ పేట కార్పొరేటర్ శేషకుమారి ఇంట్లో చోరీ!


ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో అమీర్ పేట డివిజన్ కు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన శేషకుమారి దొంగలకు టార్గెట్ గా మారారు. గత రాత్రి ఆమె ఇంట్లో చొరబడ్డ దొంగలు 4 తులాల బంగారం, 22 వేల డబ్బుతో పాటు 2 సెల్ ఫోన్లను అపహరించుకుపోయారు. తన ఇంట జరిగిన దొంగతనంపై శేషకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News