: కోహ్లీ ప్రేమ ఫెయిల్యూర్ కి సల్మాన్ సినిమా కారణమా?


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేమ ఫెయిలవ్వడం వెనుక అసలు కారణాన్ని బాలీవుడ్ లో బాహాటంగా చెప్పుకుంటున్నారు. అగ్రహీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'సుల్తాన్' సినిమాలో కథానాయికగా నటించే అవకాశం అనుష్క శర్మను వరించింది. ఈ విషయాన్ని ఆమె కోహ్లీకి చెప్పింది. దీన్ని విన్న కోహ్లీ 'దానిని అంగీకరించవద్ద'ని సూచించాడట. అయితే కోహ్లీ సలహాని తేలిగ్గా తీసుకున్న అనుష్క, ఆ సినిమా ఒప్పేసుకుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన కోహ్లీ, 'సినిమాల సంగతి పక్కనపెట్టి కుటుంబాన్ని ఎలా నడపాలో నేర్చుకో' అని హెచ్చరించాడు. దానికి అనుష్క కూడా దీటుగానే సమాధానం చెప్పిందని వినికిడి. ఈ సందర్భంగా వారు చేసుకున్న ఆరోపణలు వారిద్దరి మధ్య పెను అలజడినే రేపాయని, దీంతో తన కెరీర్ పీక్ లో ఉందని, ఈ దశలో పెళ్లి అంటే కెరీర్ ను పాడుచేసుకున్నట్టేనని, భావించిన అనుష్క, కోహ్లీకి టాటా, బాయ్, బాయ్ చెప్పేసిందని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

  • Loading...

More Telugu News