: వైజాగ్ చేరుకున్న భారత్, లంక జట్లు!
భారత్-శీలంక జట్ల మధ్య జరుగుతున్న టీట్వంటీ ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా, శ్రీలంక జట్ల సభ్యులు విశాఖపట్టణం చేరుకున్నారు. ప్రేమికుల దినోత్సవం రోజున విశాఖవాసులకు మరింత ఆనందాన్ని పంచేందుకు ఇరు దేశాల ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. కాగా, వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆడిన అనుభవం టీమిండియాలో చాలా మంది ఆటగాళ్లకు ఉంది. ఈ స్టేడియంలో దేశవాళీ పోటీలు విరివిగా నిర్వహించడంతో ఈ స్టేడియంపై పలువురికి ఆడిన అనుభవముంది. కాగా, టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ కష్టాల్లో పడ్డప్పుడు, జట్టులో అతని కెరీర్ ను సుస్థిరం చేసింది కూడా ఇదే స్టేడియం కావడం విశేషం. విండీస్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగి ఆడిన ధోనీ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. చుట్టూ కొండల మధ్యనున్న ఈ స్టేడియంను అత్యంత అందమైన స్టేడియంగా పేర్కొంటారు. రేపు సిరీస్ ను తేల్చే చివరి వన్డే ఇక్కడ జరగనుంది.