: ముందస్తు రైల్వే రిజర్వేషన్ కాలం తగ్గింపు


భారత రైల్వేలో రిజర్వేషన్ బుకింగ్ కాలాన్ని తగ్గించారు. ఇంతకుముందు నాలుగు నెలల ముందుగా టిక్కెట్లు రిజర్వ్ చేయించుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడా సౌలభ్యాన్ని 60 రోజులకు తగ్గించారు. ఈ నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి రానుంది. టిక్కెట్ల బుకింగ్ లో అక్రమాలు నిరోధించేందుకు ఈ కుదింపు అని రైల్వే అధికారులు అంటున్నారు. కొందరు గంపగుత్తగా టిక్కెట్లు బుక్ చేయడం వంటి చర్యలతో సాధారణ ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.

  • Loading...

More Telugu News