: బీసీలందరికీ న్యాయం చేస్తాం... ఏటా 500 మందిని ఉన్నత చదువులకు విదేశాలకు పంపుతా: చంద్రబాబు


బీసీలకు అండగా ఉంటామని, బీసీ జాబితాలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన రెండో విడత బీసీ రుణ మేళాలో మాట్లాడిన చంద్రబాబు పలు కీలక ప్రకటనలు చేశారు. బీసీల ఆర్థిక పరిస్థితిపై సర్వే చేయిస్తామన్నారు. విదేశాల్లో విద్యాభ్యాసానికి అర్హత సాధించిన బీసీ విద్యార్థులకు రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా బీసీలకు చెందిన 500 మంది విద్యార్థులను విదేశాలకు పంపుతామన్నారు. వెనుకబడిన వర్గాలు లేకపోతే టీడీపీనే లేదని ఆయన అన్నారు. బీసీలంతా టీడీపీ వైపే ఉన్నారన్నారు. చేనేత రుణాలను మాఫీ చేసిన ఘనత తమ పార్టీ ప్రభుత్వానిదేనన్నారు. నాయీ బ్రాహ్మణులకు ఆధునిక పనిముట్లు అందజేస్తామన్నారు. మత్స్యకారులకు పెద్ద బోట్లతో పాటు అవసరమైతే రాయితీతో పెట్రోల్, డీజిల్ అందజేస్తామన్నారు.

  • Loading...

More Telugu News