: పాక్ కు ఎఫ్-16 విమానాలు... అమెరికా నిర్ణయంపై భారత్ ఆందోళన


అగ్ర రాజ్యం అమెరికా నిన్న తీసుకున్న ఓ కీలక నిర్ణయంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరు సాగించడానికంటూ పాకిస్థాన్ కు అత్యాధునిక ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాలను అందించేందుకు ఇదివరకే కుదిరిన ఒప్పందానికి ఒబామా సర్కారు నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇందులో భాగంగా పాక్ కు అమెరికా నుంచి 8 ఫైటర్ జెట్ విమానాలు అందనున్నాయి. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు నేటి ఉదయం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్... ఢిల్లీలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మకు ఓ లేఖ రాశారు. పాక్ కు ఫైటర్ జెట్ విమానాలను అందించేందుకు అమెరికా చెప్పిన కారణంపై జైశంకర్ విభేదించారు. పాక్ కు అందించే ఫైటర్ జెట్ విమానాలు ఉగ్రవాదులపై పోరుకు కాకుండా ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News