: షహీన్ నగర్ లో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చి... ఏడుగురు రౌడీ షీటర్ల అరెస్ట్
భాగ్యనగరి హైదరాబాదులో నేరగాళ్లకు ముకుతాడు వేసేందుకు ప్రవేశపెట్టిన కార్డాన్ అండ్ సెర్చి సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలను చుట్టుముట్టిన పోలీసులు పెద్ద సంఖ్యలో నేరగాళ్లను అదుపులోకి తీసుకోవడంతో పాటు సరైన పత్రాలు లేని వందలాది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షహీన్ నగర్ ను 300 మంది పోలీసులు రౌండప్ చేశారు. ఇంటింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు రౌడీ షీటర్లతో పాటు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక సరైన పత్రాలు లేని 60 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.