: గీతం వర్శిటీలో హైదరాబాద్ విద్యార్థిని ఆత్మహత్య!
విశాఖపట్టణంలోని గీతం యూనివర్శిటీలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ కు చెందిన బి.శ్రేయ ప్రసాద్(19) ఈ కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. కళాశాల హాస్టల్ లోనే ఉంటోంది. ఈరోజు సాయంత్రం 4.30 గంటల సమయంలో ఫోన్ లో మాట్లాడుకుంటూ కన్నీరుపెట్టింది. అనంతరం తన గదిలోనే చున్నీతో ఉరి వేసుకుందని ఆరిలోవ సీఐ ధనుంజయనాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, విద్యార్థిని ఆత్మహత్య సమాచారాన్ని కళాశాల యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది.