: బీహార్ బీజేపీ ఉపాధ్యక్షుడిని కాల్చి చంపిన దుండగులు!


బీహార్ రాష్ట్రంలో బీజేపీకి చెందిన ఇద్దరు నాయకులు హతమయ్యారు. పన్నెండు గంటల వ్యవధిలో ఈ రెండు సంఘటనలు జరిగాయి. బీహార్ బీజేపీ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వర్ ఓజా ఈరోజు సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. ఒక వివాహానికి హాజరై తిరిగి వస్తున్న ఆయనను భోజ్ పూర్ జిల్లాల్లో కొందరు దుండగులు కాల్చి చంపారు. హత్య, దోపిడీలు వంటి పలు నేరాల్లో ఓజా నిందితుడు. ఆయనపై సుమారు 16 కేసులు నమోదై ఉన్నాయి. కాగా, చాప్రా జిల్లాలో మరో బీజేపీ నాయకుడు కేదార్ సింగ్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీహార్ రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయని, ఆటవిక పాలన నడుస్తోందని విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News