: ఆ జట్టు స్కోరు 0/10...నివ్వెరబోయిన క్రికెట్ బోర్డ్


గల్లీ క్రికెట్ లో కూడా చోటుచేసుకోని వింత ఘటన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహించిన టోర్నీలో చోటుచేసుకోవడంతో...ఆ ఫలితం గురించి విన్న సదరు క్రికెట్ బోర్డు బిత్తరపోయింది. కెంట్ ప్రాంతంలోని కంటెర్ బరీ స్టేడియంలో ఓ ప్రాంతీయ టోర్నమెంటును నిర్వహించారు. ఈ టోర్నీలో బాష్ ఛైల్డ్ జట్టు, క్రైస్ట్ చర్చ్ యూనివర్సిటీ జట్లు ఫైనల్ చేరాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన క్రైస్ట్ చర్చ్ యూనివర్సీటీ జట్టు 120 పరుగులు చేసింది. 121 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బాష్ చైల్డ్ జట్టు కేవలం 20 బంతులను ఎదుర్కొని 10 వికెట్లు కోల్పోయింది. ఈ మొత్తం బ్యాటింగ్ లో కేవలం ఒక్కబంతిని మాత్రమే బ్యాటుతో బ్యాట్స్ మన్ అడ్డుకోవడం విశేషం. దీంతో స్కోరు బోర్డుమీద పరుగులేమీ చేయకుండా ఆ జట్టు పెవిలియన్ చేరింది. ఈ ఫలితం గురించి విన్న ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు బిత్తరపోయింది. ఎలా స్పందించాలో కూడా వారికి తెలియలేదు. కనీసం గల్లీ టోర్నీలో కూడా ఇలాంటి ఫలితం నమోదై ఉండదని అధికారులు అభిప్రాయపడ్డారు. ఏ స్థాయి క్రికెట్ లో అయినా ఇదే రికార్డేమో...ఇలాంటి రికార్డు అసలు నమోదయ్యే అవకాశం కూడా ఉండదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News