: ఢిల్లీలో ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ


మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ కొద్దిసేపటి కిందట ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలు, తెలంగాణకు కేటాయించాల్సిన నిధులపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కేసీఆర్ భేటీ కానున్నారు. అంతేగాక మంత్రులు రాజ్ నాథ్ సింగ్, ప్రకాశ్ జవదేకర్ లను కూడా సీఎం కలవనున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, బూర నర్సయ్యగౌడ్, మంత్రి జగదీశ్ రెడ్డి సీఎం వెంట ఉన్నారు.

  • Loading...

More Telugu News