: కమాండ్ చేద్దాం.. డిమాండ్ చేద్దాం: తెలంగాణపై కేసీఆర్
కరీంనగర్ కదనభేరి సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ వనరులన్నింటిని దోచుకుని ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం ద్వారా కమాండ్ చేసి మరీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆంధ్రా ప్రాంత రాజకీయ పక్షాలు, ఆంధ్రా మీడియా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని కేసీఆర్ ఆరోపించారు.