: వారసురాలిని ప్రకటించిన నిర్మాత కరణ్ జోహార్
బాలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన ఆస్తికి కథానాయిక అలియా భట్ ను వారసురాలిగా ప్రకటించాడు. మొదటి నుంచి తనకు అలియా అంటే చాలా ఇష్టమని, ఏదో ఒక రోజు తన వద్ద ఉన్న ఆస్తి మొత్తానికి ఆమె వారసురాలవుతుందని కరణ్ స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం కరణ్ నిర్మిస్తున్న 'కపూర్ అండ్ సన్స్'లో అలియా నటిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ ను ముంబయిలో లాంచ్ చేశారు. ఈ సందర్భంగానే కరణ్ పైవిధంగా మాట్లాడాడు. దాంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆయన సరదా కోసం అలా అంటున్నాడా? లేక నిజమేనా? అన్నది తేల్చుకోలేకపోయారు. కాగా, కరణ్ నిర్మించిన 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాతో అలియా బాలీవుడ్ కు పరిచయమైన సంగతి తెలిసిందే.