: 'టీవీ 5' ఎడిటర్ అరుణ్ సాగర్ కన్నుమూత... సంతాపం తెలిపిన చంద్రబాబు, కేసీఆర్, జగన్


టీవీ 5 ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత అరుణ్ సాగర్ కన్నుమూశారు. జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం గడించిన అరుణ్ సాగర్ పలు పత్రికలు, న్యూస్ చానెళ్లలో పనిచేశారు. ప్రస్తుతం ఆయన టీవీ 5 న్యూస్ చానెల్ కు ఎడిటర్ గానూ వ్యవహరిస్తున్నారు. నేటి తెల్లవారుజామున గుండెపోటుకు గురైన ఆయన వెనువెంటనే తుది శ్వాస విడిచారు. జర్నలిజంలో ఉంటూనే ఆయన ‘మ్యాగ్జిమమ్ రిస్క్’, ‘మేల్ మలుపు’, ’మియర్ మేల్‘, ‘మ్యూజిక్ డైస్’ తదితర ప్రజాదరణ పొందన కవితా సంకలనాలను రాశారు. అరుణ్ సాగర్ మృతికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ, ఆయన సోదరుడు నందమూరి హరికృష్ణ, తెలంగాణ ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు సంతాపం ప్రకటించారు.

  • Loading...

More Telugu News