: నారాయణఖేడ్ లో ముగిసిన ఉపఎన్నిక ప్రచారం


మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. ఈ సాయంత్రం 5 గంటలవరకు పార్టీలు భారీ ప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతితో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. మొత్తం 8 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, టీఆర్ఎస్ నుంచి భూపాల్ రెడ్డి, టీడీపీ నుంచి విజయపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి సంజీవరెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నెల 13న ఎన్నిక జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 286 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఖేడ్ లో 1,87, 866 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఖేడ్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత చేపట్టారు.

  • Loading...

More Telugu News