: దూసుకెళ్తున్న ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం...తగ్గుతున్న ట్విట్టర్!


పలు సామాజిక మాధ్యమాలు విశేషమైన ఆదరణ పొందుతున్న ప్రస్తుత తరుణంలో ట్విట్టర్ కు ఆదరణ తగ్గుతోంది. ఫేస్ బుక్, వాట్స్ యాప్, ఇన్ స్టాగ్రాం వంటి వాటికి ఆదరణ పెరుగుతుండగా ట్విట్టర్ ఖాతాదారులు తగ్గడం ఆ సంస్థను ఆలోచనలో పడేస్తోంది. దీంతో ఫేస్ బుక్ తరహాలో ఆల్గారిధమిక్ టైమ్ లైన్ ను ప్రారంభించేందుకు ట్విట్టర్ సన్నాహాలు చేస్తోంది. గతంలో కేవలం పరిమిత పదాలతో ట్వీట్ చేసే వీలున్న ట్విట్టర్ తాజాగా ఆ పదాల సంఖ్యను పెంచింది. వినూత్నమైన ఫీచర్లతో ప్రజాదరణ చూరగొనేలా చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. కాగా, 2015 చివరి నాటికి ఫేస్ బుక్ కు 160 కోట్ల మంది ఖాతాదారులుండగా, ఇన్ స్టాగ్రాం ఖాతాదారుల సంఖ్య 40 కోట్లు. ట్విట్టర్ కు 30.50 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. దీంతో ట్విట్టర్ కంటే మిగిలిన సామాజికమాధ్యమాలదే పైచేయిగా నిలుస్తోంది.

  • Loading...

More Telugu News