: నిలువెత్తు డబ్బు కట్టలు గుమ్మరించినా తెలుగుదేశంలో చేరనంటున్న వైకాపా ఎమ్మెల్యే!


త్వరలోనే నూజివీడు వైకాపా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని జరుగుతున్న ప్రచారంపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, తనపై ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిలువెత్తు డబ్బు కట్టలు గుమ్మరించినా, తాను టీడీపీలో చేరబోనని స్పష్టం చేశారు. తెలుగుదేశం ఇప్పటికే తెలంగాణలో మునిగిపోయిందని, ఏపీలో కూడా మునిగే పరిస్థితుల్లో ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీలో చేరే ఉద్దేశం లేదని అప్పారావు తెలిపారు. చివరి వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని అన్నారు.

  • Loading...

More Telugu News