: జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం... మేయర్, డిప్యూటీ మేయర్ల ఏకగ్రీవ ఎన్నిక


హైదరాబాద్ లోని కౌన్సిల్ హాలులో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జా కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు. కొందరు తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, హిందీలో ప్రమాణస్వీకారం చేశారు. తరువాత ప్రమాణ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా హాజరయ్యారు. తరువాత గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరిగింది. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో బొంతు రామ్మోహన్ గ్రేటర్ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మన్నె కవిత ప్రతిపాదించగా, మీర్ పేట హెచ్ బి కాలనీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య బలపర్చారు. ఇక డిప్యూటీ మేయర్ గా బాబా ఫసియుద్దీన్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనను కార్పొరేటర్ శేషుకుమారి ప్రతిపాదించగా, మరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి బలపర్చారు. మేయర్, డిప్యూటీ మేయర్లను ఎంఐఎం కూడా బలపరిచింది. తరువాత వారిద్దరూ రాహుల్ బొజ్జా నుంచి ఎన్నిక ధ్రువపత్రాన్ని స్వీకరించారు.

  • Loading...

More Telugu News