: నాకు 25 వేల డాలర్లు ఇచ్చి పంపారు: హెడ్లీ
ముంబై దాడుల కేసులో నిందితుడిగా ఉండి ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణను ఎదుర్కొంటున్న డేవిడ్ హెడ్లీ మరికొన్ని ముఖ్యమైన విషయాలను నేటి విచారణలో వెల్లడించాడు. సెప్టెంబర్ 2006లో పాక్ సైన్యాధికారి మేజర్ ఇక్బాల్ తనకు 25 వేల డాలర్లు ఇచ్చి పంపాడని, ఆ మొత్తాన్ని ముంబై నారిమన్ బ్రాంచ్ లోని ఇండస్ ఇండ్ బ్యాంకు శాఖ నుంచి డ్రా చేసుకున్నానని తెలిపాడు. ఇండియాలో వ్యాపార ఖాతా తెరిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పాడు. ముంబైపై ఉగ్రదాడికి ముందు తహవూర్ రాణా వచ్చాడని, తుది రెక్కీ ఆయనే నిర్వహించాడని హెడ్లీ కోర్టుకు తెలిపాడు. సాంకేతిక కారణాల వల్ల నిన్నటి విచారణ నేటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.