: స్వామి అనుగ్రహం వల్లే ‘అన్నమయ్య’ పాత్రలో నటించాను: నాగార్జున


వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్లే తాను అన్నమయ్య పాత్రలో నటించానని ప్రముఖ సినీ నటుడు నాగార్జున అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వైకుంఠనాథుడి వైభవోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు హాజరైన నాగార్జునకు సంబంధిత సిబ్బంది స్వాగతం పలికారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆయన నామాలు కూడా పెట్టించుకుని, శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ, హైదరాబాద్ లో వెంకటేశ్వర వైభవోత్సవాలు జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. కొండకు వెళ్లలేని వాళ్లందరూ తిరుమల శ్రీవారిని ఇక్కడే దర్శించుకోవచ్చన్నారు. ఢిల్లీ, వైజాగ్, నెల్లూరులలో కూడా ఇలాంటి వైభవోత్సవాలు నిర్వహించారని, వీటి ద్వారా స్వామి వారి వైభవం గురించి అందరికీ తెలుస్తుందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా టీటీడీ, ప్రభుత్వం చాలా మంచిపని చేస్తున్నాయన్నారు.

  • Loading...

More Telugu News