: ఆ ద్వీపంలో వ్యవసాయం చేసేందుకు రైతు కావాలట!
ఆఫ్రికాకు, దక్షిణ అమెరికాకు మధ్య ఉన్న ఓ చిన్న ద్వీపం ట్రిస్టన్ డ కున్హా. ఓ ప్రకటనతో ఇప్పుడీ ద్వీపం వార్తల్లోకి ఎక్కింది. ఇంతకీ ఆ ప్రకటన ఏమిటంటే, ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసేందుకు ఓ మంచి రైతు కావాలట! అక్కడి అధికారులు ఇచ్చిన ఈ ప్రకటన ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ద్వీపంలో జనాభా కేవలం 300 మాత్రమే. బ్రిటిష్ పరిపాలనలో ఉన్న ఈ దీవి ప్రజలకు వ్యవసాయం చేయటం అస్సలు తెలియదు. ఎక్కువగా ఆలుగడ్డలు పండిస్తుంటారు. అందువల్ల కావల్సిన వస్తువులన్నీ బ్రిటన్ నుంచే దిగుమతి చేసుకుంటుంటారు. దాంతో తమ ప్రాంతంలో వ్యవసాయం చేసేందుకు రైతు కావాలంటూ తాజాగా అక్కడి అధికారులు వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చారు.