: కేటీఆర్ కు భద్రత పెంచిన తెలంగాణ ప్రభుత్వం


తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కేసీఆర్ రాజకీయ వారసుడిగా, రాష్ట్రానికి తరువాతి ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతున్న మంత్రి కేటీఆర్ కు మరింత భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో ఆయన విస్తృత ప్రచారం, టీఆర్ఎస్ ఘనవిజయానికి కారణమైన సంగతి తెలిసిందే. ఆపై ఆయనకు పట్టణాభివృద్ధి శాఖను సైతం కేటాయించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనకు మరింత భద్రత కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు ఓ బులెట్ ప్రూఫ్ వాహనం, ఇద్దరు గన్ మెన్లు, ఇంటి వద్ద భద్రత ఉండగా, మరో వాహనాన్ని, అదనంగా భద్రతా సిబ్బందినీ నియమించారు.

  • Loading...

More Telugu News