: నేనిప్పుడే పెళ్లి చేసుకోవట్లేదు: ప్రీతీజింతా
తన పెళ్లిపై వస్తున్న వార్తలను బాలీవుడ్ నటి ప్రీతీజింతా ఖండించింది. తానిప్పుడే పెళ్లి చేసుకోవట్లేదంటూ ట్విట్టర్ లో స్పష్టం చేసింది. "నా పెళ్లి తేదీని ప్రకటించే విషయాన్ని నాకే వదిలేయండి. అప్పటివరకు నన్ను ఒంటరిగా వదిలేయండి, ప్లీజ్. నా వ్యక్తిగత విషయాలపై వస్తున్న వార్తలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి పుకార్లను ఆపండి" అంటూ ప్రీతీ ట్వీట్ చేసింది. కాగా అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ ఎనలిస్ట్ జీన్ గుడ్ ఇనోను ఈ నెల 12న ఆమె వివాహం చేసుకోబోతున్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది.