: తెలంగాణలో విద్యావ్యవస్థ ప్రక్షాళన... సీఎం కేసీఆర్ ఆదేశం


తెలంగాణలో ప్రస్తుత విద్యావ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. అన్ని స్థాయుల విద్యాసంస్థల నిర్వహణ, బాధ్యత రాష్ట్ర విద్యాశాఖకే అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మెడికల్, అగ్రికల్చర్, ఫార్మా రంగాలకు మినహాయింపు ఇచ్చారు. క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై ఇవాళ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని... పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యాసంస్థలు, స్టడీ సర్కిళ్లు వేర్వేరు శాఖల నిర్వహణలో ఉన్నాయని కేసీఆర్ అన్నారు. ఇలా ఎవరికి వారుగా విద్యాసంస్థలు నిర్వహించడం వల్ల సమగ్రత లోపించిందని పేర్కొన్నారు. దాంతో విద్యార్థులకు అవసరమైన విద్య, ఉద్యోగ అవకాశాలు పెంచే శిక్షణ అందడం లేదని, ఎలాంటి ఉద్యోగ అవకాశాలున్నాయో తెలుసుకునేలా వారిని తీర్చిదిద్దడం లేదని చెప్పారు. ఈ క్రమంలో అన్నిరకాల విద్యాసంస్థలను ఒకే గొడుకు కిందకు తెచ్చే విషయమై సమగ్ర అధ్యయనం చేసి కొత్త విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విధాన రూపకల్పన జరగాలని ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News