: అనుమతి లేకుండా తల్లిదండ్రులను కలిశాడని...ఆ బాలుడిని టీచర్లు కొట్టి చంపేశారు!


ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలు పిల్లల్ని పొట్టన పెట్టుకుంటున్న వైనాన్ని తెలిపే సంఘటన ఇది. పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్ లోని డాక్ బంగ్లా సమీపంలోని ఆల్ ఇస్లామియా మిషన్ పాఠశాలలో షమీమ్ మాలిక్ (12) అనే బాలుడు సోమవారం సాయంత్రం పాఠశాల బయట తల్లిదండ్రులను కలిశాడు. అంతే, అనుమతి తీసుకోకుండా తల్లిదండ్రులను కలిశాడన్న కారణంతో స్కూల్ హెడ్ మాస్టర్ హలీఫ్ షేక్, వార్డెన్ లీటన్ షేక్ ఒకరి తరువాత ఒకరు బాలుడిని తీవ్రంగా కొట్టారు. బాలుడన్న కనికరం లేకుండా విచక్షణారహితంగా చితక్కొట్టడంతో షమీమ్ మాలిక్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అప్పటికి తేరుకున్న వారిద్దరూ ఆసుపత్రిలో బాలుడ్ని చేర్చారు. అప్పటికే పరిస్థతి విషమించడంతో షమీమ్ మృత్యువాతపడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిద్దరినీ అరెస్టు చేశారు. కాగా, తమను కలిశాడన్న కారణంగా తమ కుమారుడ్ని వారిద్దరూ హత్య చేశారని షమీమ్ తల్లి షమీనా బీబీ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News