: ఢిల్లీలో మోదీతో చంద్రబాబు భేటీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఇవ్వాల్సిన రాయితీలు, నిధుల లేమి తదితర అంశాలపై మోదీతో చంద్రబాబు చర్చిస్తున్నట్టు సమాచారం. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని బాబు కలిశారు. రెవెన్యూ లోటు భర్తీ చేయాలని, వెనుకబడిన జిల్లాలకు గ్రాంటు ఇవ్వాలని, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తరహాలో పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని జైట్లీని కోరారు. అంతేగాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర ఆర్థిక అంశాలపై కేంద్ర మంత్రితో చంద్రబాబు చర్చించారు.