: పెళ్లికూతురవుతున్న ప్రీతీజింతా!... అమెరికా ఫైనాన్షియల్ ఎనలిస్ట్ తో వివాహం


బాలీవుడ్ నటి, సొట్టబుగ్గల సుందరి ప్రీతీజింతా పెళ్లి కూతురవుతోంది. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ ఎనలిస్ట్ జీన్ గుడ్ ఇనోను వివాహమాడబోతోంది. ఈ నెల 12న వారిద్దరూ వివాహబంధంతో ఒకటి కాబోతున్నారని బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. ఈ నెల 12 నుంచి 16 వరకు లాస్ ఏంజెల్స్ లో వారి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతాయని తెలిసింది. అయితే పెళ్లి వార్తపై ప్రీతీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రముఖ వ్యాపారవేత్త నెస్ వాడియా, ప్రీతి గతంలో ప్రేమాయణం నడిపారు. 2008 ఐపీఎల్ లో గొడవల కారణంగా వాడియాపై ప్రీతి కేసు కూడా పెట్టింది. దాంతో ఇద్దరూ విడిపోయారు. మళ్లీ కొన్ని రోజులకే తానో వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు ప్రీతి చెప్పింది. అయినా అతనెవరనేది మాత్రం బయటికి రాలేదు. అనూహ్యంగా ఇప్పుడు జీన్ తో ప్రీతి పెళ్లి జరుగుతోందన్న వార్తలు షికారు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News