: విశాఖ రైల్వేజోన్ పై త్వరగా నిర్ణయం తీసుకోండి: రైల్వేమంత్రిని కోరిన చంద్రబాబు


ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభుకు పలు ప్రాతిపాదనలు చేశారు. ఈ మేరకు మంత్రి కార్యాలయంలో ఆయనను కలసిన సీఎం... విశాఖ రైల్వేజోన్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. దాంతో పాటు రాజమహేంద్రవరం పాతరైల్వే బ్రిడ్జిని రాష్ట్రప్రభుత్వానికి అప్పగించాలన్నారు. విజయవాడ-అమరావతి-గుంటూరును కలుపుతూ రైల్వేమార్గం నిర్మించాలని తెలిపారు. విశాఖ-చెన్నై మధ్య మూడో రైల్వేలైన్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవాలని, కాకినాడ-పిఠాపురం, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ల నిర్మాణం, గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ పనులు చేపట్టాలని సురేశ్ ప్రభుకు బాబు విన్నవించారు. ఇతర రైల్వేలైన్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News