: నా భర్తను హత్య చేశారు: డాక్టర్ శశికుమార్ భార్య ఆరోపణ


హైదరాబాద్ హిమయత్ నగర్ లో వైద్యుల కాల్పుల ఘటనలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన భర్త డాక్టరు శశికుమార్ ను హత్య చేశారని ఆయన భార్య క్రాంతి ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి మీడియాకు క్రాంతి ఒక లేఖ రాశారు. వైద్యులు సాయికుమార్, ఉదయ్ కుమార్ కలిసి తన భర్తను హత్య చేయించారని ఆ లేఖలో ఆమె ఆరోపించారు. తన భర్తను నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి పిలిపించారని, తర్వాత కిరాయి హంతకులతో ఆయనను చంపించారని పేర్కొన్నారు. కాల్పుల ఘటన అంతా నాటకమని, అంతకుముందే తన భర్తను వారు హత్య చేయించారని ఆమె ఆరోపించారు. కాగా, ఈ కేసుకు సంబంధించిన ఏకైక సాక్షి డాక్టర్ సాయికుమార్ ను నారాయణగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాల్పులకు బాధ్యుడు సాయికుమారేనని శశికుమార్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, శశికుమారే తమపై కాల్పులకు పాల్పడ్డాడని సాయికుమార్ అంటున్నాడు.

  • Loading...

More Telugu News