: ఇంకా చిక్కని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల జాడ!


వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ (ఐఐఐటీ)లో విద్యను అభ్యసిస్తూ, గత శనివారం నుంచి కనిపించకుండా పోయిన నవీన్, సౌందర్యల జంట ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మూడు రోజుల క్రితం వీరు కడప ప్రాంతంలోని శేషాచలం అడవుల్లోకి వెళ్లగా, అక్కడ దారి తప్పిన సంగతి తెలిసిందే. విషయాన్ని సౌందర్య స్వయంగా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరించగా, అప్పటి నుంచి స్పెషల్ పార్టీ పోలీసులు, అటవీ భద్రతా దళాలు వారి కోసం గాలిస్తున్నాయి. మరలా ఫోన్ రాకపోవడం, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమై రెండు రోజులు గడుస్తున్నా వారి జాడ తెలియకపోవడంతో వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, ఐఐఐటీలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న నవీన్, సౌందర్యలు జంటగా అడవుల్లోకి ఎందుకు వెళ్లారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చిక్కలేదు.

  • Loading...

More Telugu News