: ఉజ్వల కెరీరే ముఖ్యం.. ఆ తర్వాతే ప్రేమ, పెళ్లి: కోహ్లీ, అనుష్కల బ్రేకప్ కు కారణమిదేనట!


టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్ కు కూడా వీడ్కోలు చెబితే... టీమిండియా మూడు ఫార్మాట్ల జట్టు నాయకత్వ బాధ్యతలు అతడికే దక్కనున్నాయి. తనదైన రోజున ప్రత్యర్థి బౌలర్లకు అతడు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అతడు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఇక బాలీవుడ్ లో తాను నటిస్తున్న చిత్రాలు వరుసగా హిట్ అవుతుండటంతో అనుష్క శర్మ కూడా తన రెరీర్ లో దాదాపు కీలక దశలో ఉంది. కోహ్లీ, అనుష్కల మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారిన నేపథ్యంలో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తాజాగా వీరు విడిపోయారు. ఇందుకు కారణాలేంటన్న విషయంలో వారం రోజులుగా పెద్ద ఎత్తున చర్చే నడుస్తోంది. ఈ క్రమంలో వారి బ్రేకప్ కు కారణం వెల్లడైంది. తమ తమ రంగాల్లో అత్యున్నత స్థితిలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకుని తమ కెరీర్లను నాశనం చేసుకునేందుకు ఇష్టపడటం లేదట. ఈ క్రమంలోనే కోహ్లీ ప్రతిపాదించిన పెళ్లి ప్రపోజల్ ను అనుష్క తిరస్కరించిందట. ఆ తర్వాత కోహ్లీ కూడా కాస్తంత లోతుగానే ఆలోచించి ప్రేమ, పెళ్లిలను పక్కనబెట్టేశాడు. బ్రేకప్ కు సంబంధించి వారిద్దరూ తమ సన్నిహితుల వద్ద బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నట్లు బాలీవుడ్ లో జోరుగా చర్చ సాగుతోంది.

  • Loading...

More Telugu News