: మా రాష్ట్రంలో గోమాంసాన్ని ఎందుకు అనుమతించకూడదు?: హర్యానా సీఎం


మద్యాన్ని నిషేధించిన గుజరాత్ లో ప్రత్యేక అనుమతి కింద విదేశీయులకు మద్యాన్ని అనుమతిస్తున్నప్పుడు తమ రాష్ట్రంలో గోమాంసాన్ని ఎందుకు అనుమతించకూడదంటూ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రశ్నించారు. లగ్జరీ హోటళ్లలో విదేశీయులకు గోమాంసాన్ని అనుమతిస్తామని, అందుకు ప్రత్యేక లైసెన్స్ విధానాన్ని తీసుకొస్తామని ఆయన అన్నారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు గోమాంసం తినే అలవాటు ఎక్కువగా ఉంటుందని, వారి అభిరుచులను ఎందుకు కాదనాలంటూ గుజరాత్ లో మద్యం అంశాన్ని ఆయన ప్రస్తావించారు. బీజేపీ నేతగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, ఈ విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని, దీనిని పరిశీలించాల్సి ఉందని ఖట్టర్ కు ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్న జవహర్ యాదవ్ ఈరోజు వివరణ ఇచ్చారు. కాగా, భారత్ లో నివసించాలంటే గోమాంసం తినడం మానుకోవాలని, అది చేతకాని పక్షంలో దేశం విడిచి వెళ్లాలని ఖట్టర్ గతంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోమాంసాన్ని విక్రయించినా, కొనుగోలు చేసినా భారీ జరిమానా, జైలుశిక్ష విధిస్తామని ఖట్టర్ నాడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News