: కొత్త టాటూలతో ఏంజిలినా జోలి!
తన 18వ ఏట నుంచి టాటూలు వేసుకోవడం ప్రారంభించిన ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజిలినా జోలికి ఇప్పుడు నలభై ఏళ్లు. ఈ వయస్సులో కూడా ఆమెకు టాటూలపై మోజు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా, మరో మూడు టాటూలను తన శరీరంపై వేయించుకుంది. ఆమె తాజా చిత్రం ‘ఫస్ట్ దె కిల్డ్ మై ఫాదర్’ షూటింగ్ ప్రస్తుతం కాంబోడియా దేశంలో జరుగుతోంది. ఈ షూటింగ్ నిమిత్తం అక్కడే ఉన్న ఏంజెలినా తన కొత్త టాటూలను నిన్న ప్రదర్శించింది. ఆ మూడు టాటూల్లో రెండు ప్రాచీన థాయి బౌద్ధ సూచికలు కాగా, మరొకటి పెట్టె ఆకారం ఉన్న టాటూ.