: చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో ఎందుకు కలిపాడు...ఇప్పుడు అడిగే హక్కు ఉందా?: చంద్రబాబు
కాపులకు మేలు చేస్తానని నమ్మబలికి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవికి తనను విమర్శించే హక్కు ఉందా? అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఒక పార్టీ అధినేతగా, కేంద్ర మంత్రిగా చిరంజీవి కాపులకు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. కాపులకు ఏ ప్రయోజనం కలుగుతుందని భావించి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపాడో చెప్పాలని ఆయన నిలదీశారు. చిరంజీవికి ప్రశ్నించే అర్హత, అడిగే నైతికత లేవని ఆయన స్పష్టం చేశారు. కాపులకు నిబద్ధతతో ఏదైనా చేయాలని భావించే తనను ప్రశ్నించడం ఎంత వరకు సమంజసమని ఆయన అడిగారు. కాపులకు ఏం చేయాలో తనకు తెలుసని, ఆ దిశగా తాము పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు.