: ఎయిర్ పోర్టులో నిర్బంధించడంపై చిరంజీవి మండిపాటు
రాజమండ్రి ఎయిర్ పోర్టులో తనను, పార్టీ ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఇంకా పలువురిని పోలీసులు నిర్బంధించడంపై రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తాము ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలిపేందుకే వచ్చామని, ఎలాంటి అరాచకాలు చేయడానికి రాలేదని మీడియాతో అన్నారు. 151 సెక్షన్ కింద ఎయిర్ పోర్టులోనే తమను నిర్బంధించారని, ఇది సరైన పధ్ధతి కాదని అన్నారు. టీడీపీ ప్రతిపక్షంగా ఉండగా ఒక పద్ధతి... అధికారంలో ఉండగా మరో పద్ధతి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ఇలా చేయడం అప్రజాస్వామికమని, ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, తమ నోళ్లు మూయించడానికి చేసిన చర్యగా దీనిని భావిస్తున్నామని చిరు వ్యాఖ్యానించారు.