: నటుడు సోనూసూద్ తండ్రి శక్తిసూద్ కన్నుమూత
సినీ నటుడు సోనూసూద్ తండ్రి శక్తి సాగర్ సూద్(77) కన్నుమూశారు. పంజాబ్ లోని మోగాలో తన నివాసంలో నిన్న (ఆదివారం) రాత్రి ఆయన గుండెపోటుతో మరణించారు. ఇటీవల తండ్రిని చూసేందుకు సోనూ చండీగఢ్ నుంచి మోగా వెళ్లాడు. నిన్న రాత్రి వీరు సరదాగా టీవీ చూస్తుండగా, ఉన్నట్టుండి శక్తిసూద్ మంచం మీద నుంచి కింద పడిపోయారు. వెంటనే సోనూ తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆయన గుండెపోటుతో చనిపోయారని వైద్యులు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా శక్తిసూద్ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. 2008లోనే సోనూసూద్ తల్లి సరోజ్ సూద్ మరణించారు.