: బాబును ఏదైనా తిట్టివుంటే క్షమించండి: ముద్రగడ
కాపు జాతి సంక్షేమం కోసం జీవితాంతం కట్టుబడేందుకు నిర్ణయించుకున్న తాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి ఏవైనా అనరాని మాటలు అనుంటే కనుక మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నట్టు ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. కాపుల రిజర్వేషన్ కోసం మరోసారి రోడ్డెక్కేలా చేయరాదని, అనుకున్న గడువులోగా కమిషన్ నివేదిక వచ్చి, ఆపై రిజర్వేషన్ల అమలు జరగాలన్నదే తన అభిమతమని అన్నారు. తనకు వయసు పెరుగుతోందని, ఎంతకాలం ఓపికగా ఉండగలుగుతానో తెలియదని అన్న ముద్రగడ, సాధ్యమైనంత త్వరగా చంద్రబాబు కాపులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమ ప్రసంగాల్లో భాగంగా విమర్శించినా, తిట్టినా వాటిని మనసులో పెట్టుకోవద్దని, ఇచ్చిన మాట తప్పవద్దని చంద్రబాబును కోరారు.