: మరో పదేళ్లు ఏపీ అసెంబ్లీ సీట్లు ఇంతే: ఎన్నికల కమిషన్ చెప్పిందన్న మేకపాటి
ఆంధ్రప్రదేశ్ లో మరో పదేళ్ల పాటు అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచే అవకాశాలు లేవని వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ ఉదయం ఎన్నికల సంఘం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మరో 50 మందిని అసెంబ్లీకి పంపుతామని చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. ఆయన చేస్తున్న ప్రచారంలో నిజాన్ని కనుగొనేందుకు ఎలక్షన్ కమిషన్ తో భేటీ అయ్యానని, 2026 వరకూ సీట్ల పెంపు కుదరదని అధికారులు తెలిపారని చెప్పారు. అటార్నీ జనరల్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారని మేకపాటి తెలిపారు. చంద్రబాబు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు.