: 2న ప్రియురాలిని చంపి, 4న మరో యువతిని వివాహమాడి... 7న ఊచల వెనక్కు!


తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసిన యువతిని కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని ఇంట్లో దాచడమే కాకుండా, రెండు రోజుల తరువాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడో ఘనుడు. అసలు విషయం వెల్లడి కావడంతో పెళ్లయిన మూడో రోజునే అరెస్ట్ కాబడి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఢిల్లీ మోడల్ టౌన్ నివాసి నవీన్ ఖాత్రీ (23) గత కొంత కాలంగా పొరుగున ఉండే ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని అర్జూ సింగ్ చౌహాన్ (21)ను ప్రేమిస్తున్నాడు. ఈలోగా నవీన్ కు పెద్దలు వివాహం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న అర్జూ నిలదీసే సరికి 2వ తేదీన అమెను హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని దాచాడు. అర్జూ ఇంటికి రాకపోవడాన్ని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు మంగళవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్జూ సెల్ ఫోన్ సమాచారం, ఆమె కాల్ డేటాను పోలీసులు విచారిస్తున్న సమయంలో, రెండు రోజుల తరువాత 4వ తేదీన పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్నాడు నవీన్. పోలీసులు 7వ తేదీన నవీన్ ను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారిస్తే, నేరాన్ని అంగీకరించాడు. ఆపై ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును విచారిస్తున్నామని, నిందితుడిని కోర్టు ముందు హాజరు పరచనున్నామని నార్త్ వెస్ట్ ఢిల్లీ డీసీపీ విజయ్ సింగ్ తెలిపారు. ఈ కేసులో నవీన్ తండ్రి పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News